భారత్‌లో కరోనా వైరస్‌ ప్రతాపం చూపుతోంది. కోవిడ్19 తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతుండటంంతో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,282 మంది కరోనా వైరస్ (COVID19 cases in India) బారిన పడ్డారు. వీటితో కలిపి భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. TRS ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే (బుధవారం) అత్యధికంగా 904 మంది కోవిడ్19 కారణంగా మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 40,699 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 13,28,337 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,95,501 యాక్టివ్‌ కేసున్నాయి. Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి


భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 2,21,49,351 కరోనా నిర్ధారణ టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. కాగా, బుధవారం ఒక్కరోజే 6,64,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. సాహో డైరెక్టర్ Sujeeth Wedding Photos 
 పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...